బిగ్ న్యూస్: రాపాక కి షాక్ ఇచ్చిన జన సేన..!

Monday, February 22nd, 2021, 06:12:38 PM IST

పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జన సేన నుండి 2019 ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. అయితే రాజోలు నియోజక వర్గం నుండి గెలుపొందిన రాపాక వరప్రసాద్ కొద్ది రోజులకే అధికార పార్టీ వైసీపీ కి జై కొట్టారు. పలు సంక్షేమ పథకాలు అమలు విషయం లో వైసీపీ కి మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా, పూర్తి స్థాయిలో ప్రశంసల వర్షం కురిపించారు. అయితే జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాదరావు పై అప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే జన సైనికులు మాత్రం రాపాక కి ఈ పంచాయతీ ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చారు. పంచాయతి ఎన్నికల్లో దాదాపు 20 కి పైగా స్థానాల్లో జన సేన కి చెందిన నేతలు విజయం సాధించారు.

అయితే పడమటి పాలెం, టెకిషెట్టి పాలెం, కేశవదాసు పాలెం, కాత్రెని పాడు, ఈటుకూరు, మెడిచర్ల పాలెం, బట్టే లంక, రామరాజు లంక, కత్తిమండ, కూనవరం, గోగునమ్మటం, తూర్పు పాలెం, సఖినేటిపల్లి లంక, అంతర్వేది, అంతర్వేది కర, మామిడికుదురు లతో పాటుగా పలు స్థానాల్లో జన సేన ఘన విజయం సాధించింది. అయితే రాపాక వరప్రసాదరావు కి జన సేన ఈ పంచాయతీ ఎన్నికల తో గట్టి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ మేరకు జన సేన అభిమానులు రాపాక పై గుర్రుగా ఉన్నారు. పవన్ కి రాపాక వెన్నుపోటు పట్ల జన సైనికులు సరైన రీతిలో రివెంజ్ తీర్చుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి.