ఎమ్మెల్యే రాపాక కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జన సైనికులు… నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీ!

Monday, March 22nd, 2021, 02:40:23 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 2019 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పెట్టిన జన సేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు. అయితే ఈయన కొద్ది రోజులకే అధికార పార్టీ వైసీపీ కి అనుకూలం గా వ్యవహరించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు అవకాశం దొరికిన ప్రతి సారి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయితే రాపాక వరప్రసాదరావు కి మరొకసారి జన సైనికులు వార్నింగ్ ఇచ్చారు. రాజోలు నియోజక వర్గంలో జన సేన పార్టీ బహిరంగ సభ ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు జిల్లా నాయకులు ఈ సభ కి హాజరు కానున్నారు.

అయితే రాపాక వరప్రసాదరావు గెలిచిన సొంత నియోజక వర్గం రాజోలు. అయితే తాము ఏర్పాటు చేసిన బహిరంగ సభ కి రాపాక కి అనుమతి లేదు అంటూ చెప్పుకొచ్చారు. నో ఎంట్రీ అంటూ పలు చోట్ల ఫ్లెక్సీ ల ఏర్పాటు చేశారు. అయితే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాపాక సైతం జన సేన పార్టీ పై, పవన్ కళ్యాణ్ పై పలు మార్లు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. అందుకు గాను, పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు పంచాయతీ ఎన్నికల్లో గట్టి సమాధానం ఇచ్చారు.