వెళ్ళటం ఖాయం..బాబు పిలుపే ఆలస్యం

Thursday, December 31st, 2015, 06:20:25 PM IST


కొన్ని నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న వైసీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన పార్టీ మార్పు పై ఓ స్పష్టత ఇచ్చేశారు. బుధవారం ముద్దనూరులోని ఏమ్మార్సీ భవనంలో నిర్వహించిన మండలి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘ పెళ్ళికి పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు. పెళ్లి కుమార్తె తరపు వారి పిలుపే ఆలస్యం ‘ అంటూ జోక్ చేశారు.

తానూ టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని, ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నానని, చంద్రబాబు నాయుడిగారి వద్ద నుండి పిలుపు రాగానే వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపొతానని అన్నారు. ఈమేరకు తన కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు, అంతా సిద్దమయ్యాక టీడీపీలో చేరేందుకు ముహూర్తం సిద్దం చేసుకుంటానని అన్నారు. ఇక ఈయన పార్టీకి రాజీనామా చేయటం వైసీపీకి రాజకీయంగా నష్టమైతే టీడీపీలో చేరటమనేది వైసీపీ అదినేత జగన్ కు పెద్ద ఎదురుదేబ్బని పలువురు రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు.