టీఆర్ఎస్ ఓడితే హరీశ్‌కి మంత్రి పదవి పోతుంది.. జగ్గారెడ్డి అల్టీమేట్ కామెంట్స్..!

Thursday, October 22nd, 2020, 02:07:36 AM IST


దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అది రాష్ట్ర ప్రజలకు శాపం అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పంటలు మొత్తం మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలలో ఒక్క హామీనీ కూడా నెరవేర్చకుండా గెలిస్తే సీఎం కేసీఆర్ కాలర్ ఎగరవేస్తారని అన్నారు. దుబ్బాక ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే కేసీఆర్ వంద మెట్లు దిగివస్తాడని అన్నారు.

అయితే టీఆర్ఎస్ పార్టీ అటు పోలీసులను, ఇటు డబ్బును విచ్చలవిడిగా వాడుతుందని అన్నారు. మంత్రి హరీశ్ రావు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇక సిద్దిపేట కలెక్టర్ సీఎం కేసీఆర్‌కు పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నిక జరగక ముందే గెలిచినట్లుగా హరీశ్‌ రావు భావించి మెజారిటీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అయితే దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడితే మంత్రి పదవి పోతుందని భయపడుతున్నారని అన్నారు.