తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జగదీష్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, సీఎం కేసీఆర్ విస్కీలో సోడాలు కలిపే నీకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తాము తలుచుకుంటే జగదీష్‌రెడ్డి తిరగగలడా అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు జగదీష్‌రెడ్డి పేరుకు కరెంట్ మినిస్టర్ కానీ ఆయన దగ్గర పవర్ లేదని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే అంతకు ముందు రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటే చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి జగ్గారెడ్డి అన్నారు. 6 ఏళ్ళ పాలనతో 60 ఏళ్ల పాలనను పోలుస్తూ చర్చ పెడదమా అంటూ కాంగ్రెస్ నేతలకు మంత్రి సవాల్ విసిరారు. అభివృద్ధిని చూసి తట్టుకోలేక అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ ఉనికి కోసమే ఇటువంటి దిగజారుడు విమర్శలకు పూనుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.