వై ఎస్ తండ్రి పాత్రలో .. జగపతిబాబు?

Monday, July 2nd, 2018, 12:27:10 PM IST

మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజా శేఖర రెడ్డి బయోపిక్ రుపొంతున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి టైటిల్ రోల్ పోషిస్తున్న యాత్ర సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా జరుపుకుంటుంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వై ఎస్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు జగపతి బాబు నటిస్తున్నట్టు తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న రాజారెడ్డి ని అప్పట్లో కల్వర్టు దగ్గర బాంబు పేల్చి చంపేశారు. వై ఎస్ జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వై ఎస్ భార్య విజయమ్మ పాత్రకోసం ఓ బాలీవుడ్ నటి నటిస్తున్నట్టు తెలిసింది. అలాగే వై ఎస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. తాజాగా రాజారెడ్డి పాత్ర కోసం జగపతి బాబు ఓకే చెప్పాడట. ఈ మధ్య విలన్ గా తనదైన ఇమేజ్ తెచ్చుకున్న జగపతి బాబు ఒక్క తెలుగులోనే కాకుండా అటు తమిళ ఇటు హిందిలో కూడా అవకాశాలు అందుకుంటున్నారు.