ఏదన్నా జగన్ డెసిషన్ మాత్రమే ఫైనల్..!

Friday, August 7th, 2020, 07:04:34 AM IST

గత ఏడాది గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ దెబ్బకు తెలుగుదేశం పార్టీ పరిస్థితి అతలాకుతలం అయ్యిపోయింది అని చెప్పాలి. మరీ 23 స్థానాలకే టీడీపీ పరిమితి అయ్యిపోవడంతో అప్పుడే చాలా మంది నేతలు ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలలోకి వలస పోయారు.

కానీ ఇప్పుడు టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుండడంతో ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్న నేత గంటా శ్రీనివాసరావు అని అన్న సంగతి అందరికీ తెలిసిందే.

కానీ గంటా రాక విషయంలో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు సుముఖంగా లేరు. దీనితో ఇప్పటి నుంచే గంటా రాకపై తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. కానీ వీళ్ళేం అనుకున్నా సరే ఆహ్వానించడం ఆహ్వానించకపోవడం అనేది జగన్ తీసుకునే అంతిమ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.