నేడు “జగనన్న జీవ క్రాంతి” పథకం ప్రారంభం

Thursday, December 10th, 2020, 08:30:48 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నేడు జగనన్న జీవ క్రాంతి పథకం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,869 కోట్ల వ్యయంతో 2,49,151 గొర్రెల/మేకల యూనిట్ల పంపిణీ చేయనున్నారు. ఈ పథకం లో మహిళలకి గొర్రెల/మేకల కొనుగోలు తో పాటుగా రవాణా, ఇన్సూరెన్స్ ఖర్చుల కి గానూ వైఎస్సార్ చేయూత కింద యూనిట్ కి 75 వేల రూపాయలు ఆర్ధిక సాయం ఉచితంగా అందించనున్నారు. అయితే ఒక్కొక్క యూనిట్ లో 5-6 నెలల వయసు గల 14 గొర్రె పిల్లలు/మేక పిల్లల తో పాటు ఒక యవ్వనపు పొట్టేలు/ మేకపోతు పంపిణీ చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వైసీపీ తమ అధికారిక సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగింది.