అక్రమ మద్యానికి పాల్పడుతున్న వారికి షాక్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!

Thursday, July 9th, 2020, 06:46:43 PM IST


ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దశల వారిగా మద్య నిషేదం అమలు చేస్తామని చెప్పి ఎప్పటికప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్‌కీ అక్రమ మద్యం తరలింపు పెను సవాల్‌గా మారింది.

నిత్యం అక్రమ మద్యం తరలిస్తున్న వారిని పట్టుకుని ఆ మద్యాన్ని సీజ్ చేస్తున్నా ఈ దందా మాత్రం ఆగడంలేదు. అయితే దీనిని నియంత్రించేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చట్టాలు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాన్‌ బెయిలబుల్‌ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.