ఏపీలో మరో మున్సిపల్ కార్పోరేషన్.. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం..!

Wednesday, March 24th, 2021, 05:45:22 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా విశాఖకు తరలించింది జగన్ ప్రభుత్వం. ఇకపై విశాఖకు ప్రాధాన్యం ఇస్తూ అసలు అమరావతి అనే ఊసే లేకుండా చేసేలా వైసీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

అయితే ఇప్పటికే అమరావతిలో గుంటూరు నగరపాలక సంస్థ ఉండగా తాజాగా మరో నగరపాలక సంస్థను ఏర్పాటు చేయబోతుంది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను మరియు 21 సమీప గ్రామాలను విలీనం చేస్తూ ఎంటీఎంసీ పేరుతో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది.