వాలంటీర్లకు మరో బాధ్యతలు అప్పచెబుతున్న ఏపీ సర్కార్..!

Saturday, January 16th, 2021, 09:01:45 AM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించింది. అయితే ఇప్పటికే పించన్, రేషన్ పంపిణీ వంటి పలు ముఖ్య బాధ్యతలను నిర్వహిస్తున్న వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం మరో బాధ్యతలను కట్టబెట్టబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే గ్రామాల్లో ఎల్ఈడీ వీధి ధీపాల నిర్వహణ బాధ్యతలను కూడా ఇకపై వాలంటీర్లకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను చేపట్టిన ఏజెన్సీలు తప్పుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వం ఏఏశ్ళ్ సహకారంతో 24 లక్షల వీధి ధీపాలను ఏర్పాటు చేయించి, వాటి నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక సదరు సంస్థకు దాదాపు 100 కోట్ల మేరకు చెల్లింపులు నిలిచిపోవడంతో వారు పక్కకు తప్పుకున్నట్టు సమాచారం.