గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..!

Tuesday, November 24th, 2020, 02:15:39 AM IST


గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వారు పనిచేసే ప్రాంతంలోనే నివాసం ఉండాలని ఆదేశించింది. అయితే గ్రామాల్లోనే ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను జహన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు చోట్ల ఉద్యోగులు పని చేసే చోట నివాసం ఉండకపోవడంతో ఈ లక్ష్యం నీరుగారుతోంది.

అందుకే పనిచేసే చోటే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నివాసం ఉండాలని ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారు సదరు గ్రామ పరిధిలో, అలాగే వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది మున్సిపాలిటీ లేదా కార్పోరేషన్ పరిధిలోనే ఉండాలని సూచించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. డివిజనల్‌, మండల స్ధాయి అధికారులు సదరు గ్రామ, వార్డు సచివాలయాలను తరచూ సందర్శిస్తూ ఉద్యోగులు అక్కడే నివాసం ఉంటున్నారో లేదో పరిశీలించాలని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొంది.