ఎమ్మెల్యే రోజాకు షాక్ ఇచ్చిన జగన్.. వ్యతిరేక వర్గానికి కీలక పదవి..!

Friday, October 2nd, 2020, 08:02:08 AM IST

నగరి ఎమ్మెల్యే రోజాకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆమె వ్యతిరేక వర్గానికి చెందిన నేతకు పార్టీ కీలక పదవి కట్టబెట్టింది. బీసీల్లోని ప్రతి కులానికి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్ తాజాగా 56 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించారు. అయితే రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్‌గా కేజే కుమార్ భార్య శాంతిని నియమించారు.

అయితే నగరిలో కేజే కుమార్‌కు, ఎమ్మెల్యే రోజాకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. గతంలో కె బిఆర్‌పురం గ్రామ సచివాలయం భూమి పూజకి వెళ్ళిన సమయంలో రోజాను గ్రామంలోకి రానివ్వకుండా ఓ వర్గం వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అంతేకాదు ఆమె కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. దీంతో సొంత పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గ కార్యకర్తలపై రోజా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇప్పుడు అలాంటి నేతలకు జగన్ పదవి కట్టబెట్టడం రోజాకు మింగుడుపడడం లేదన్న టాక్ వినిపిస్తుంది.