ఏపీలోని మందుబాబులకు జగన్ సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది. ఇకపై పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే వీలు లేకుండా కొత్త జీవోను విడుదల చేసింది. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు అనుమతిలేదని, అలా మద్యం తెస్తే శిక్షార్హులని ఎక్సైజ్‌శాఖ హెచ్చరించింది. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులని ఎక్సైజ్ శాఖ జీవో నెంబర్ 310ను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఏపీ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్ట్ కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే వెసులుబాటు కల్పించింది. అప్పుడు హైకోర్టు తీర్పుతో ఏపీలోని మద్యం ప్రియులకు కాస్త ఉపశమనం కలిగినప్పటికి, మళ్ళీ దీనిపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో మరోసారి మందుబాబులకు షాక్ తగిలింది.