సంక్రాంతి పండుగ రోజు రైతులకు గుడ్ న్యూస్ అందించిన ఏపీ సర్కార్..!

Thursday, January 14th, 2021, 04:41:15 PM IST

సంక్రాంతి పండుగ రోజున రైతులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ అందించింది. రైతులకు చెల్లించాల్సిన బకాయిల కోసం వేయి కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఇటీవల వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమీష నిర్వహించిన సీఎం జగన్ రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలను సంక్రాంతి నాటికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపధ్యంలో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిల కోసం ప్రభుత్వం ఈ రోజు వెయ్యి కోట్లు విడుదల చేసింది. అయితే ఈ నగదు మొత్తాన్ని ఆర్థిక శాఖ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌కు విడుదల చేసింది. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి చెల్లించాల్సిన డబ్బులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు రైతులకు చెల్లించాల్సిన మిగతా బకాయిలను కూడా త్వరలోనే చెల్లిస్తామని అధికారులు తెలిపారు.