మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ సంచయితకు కీలక పదవి కట్టబెట్టిన జగన్ సర్కార్..!

Monday, November 16th, 2020, 10:02:16 PM IST

మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక పదవి కట్టబెట్టింది. అయితే ఇదివరకే సింహాచల దేవస్ధానం పాలక మండలి చైర్ పర్సన్‌గా సంచయితను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయనగరరాజుల ఆధీనంలో ఉన్న మాన్సస్ ట్రస్ట్ బోర్డుకు చైర్‌పర్సన్ బాధ్యతలను అప్పగించారు. అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్ పర్సన్‌గా సంచయితను ప్రభుత్వం ప్రకటించింది.

అయితే గతంలో సింహాచలం ఆలయంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు గతంలో సంచయిత తండ్రి ఆనందగజపతిరాజు చైర్మన్‌గా వ్యవహరించారు. అయితే ఆనందగజపతిరాజు వారసురాలిగా సంచయితను ఆ 104 ఆలయాలకు చైర్మన్‌గా నియమించాలని దేవాదాయశాఖకు ప్రభుత్వం అక్టోబర్ 27న లేఖ రాసింది. రూ.2 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న ఆ 104 ఆలయాలకు సంచయిత ఇకపై చైర్ పర్సన్‌గా వ్యవహరించబోతున్నారు.