స్థానిక సంస్థల పాలనపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!

Thursday, August 6th, 2020, 11:25:24 PM IST


ఏపీలోని స్థానిక సంస్థల పాలనపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ప్రత్యేకాధికారుల పాలన జరిగేలా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 108 కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపిచడం లేదు. గత ఏడాది మార్చిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం భావించినప్పటికి కరోనా కారణంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించడం, హైకోర్ట్ మరియు గవర్నర్ ఆదేశాల మేరకు ఆయనను తిరిగి నియమించడం కూడా జరిగింది.