వరల్డ్ రికార్డ్ సెట్ చేసిన వైఎస్ జగన్ అభిమానులు

Tuesday, December 22nd, 2020, 11:52:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ కి చెందిన నేతలు, నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు. అయితే ఇప్పటి వరకు 10,500 యూనిట్ల బ్లడ్ డొనేషన్ తో వరల్డ్ రికార్డ్ ఉండగా, ఇప్పుడు దానిని జగన్ మోహన్ రెడ్డి గారి అభిమానులు బ్రేక్ చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసారు. ఇప్పటి వరకూ 35,000 యూనిట్ల బ్లడ్ ను అభిమానులు, కార్యకర్తలు, వైసీపీ కి చెందిన వారు దానం చేశారు. ఒకే ఒక్క రోజు లో ఈ రికార్డ్ ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార వైసీపీ గత ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ది కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యల తో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు సైతం ప్రజలను ఆకర్షించడం తో పలువురు నేతలు, ఇతర పార్టీలకు చెందిన వారు కూడా అధికార వైసీపీ లోకి చేరుతున్నారు.