జగన్ సవాలు స్వీకరించే సాహసం చెయ్యలేదు.!

Wednesday, August 5th, 2020, 01:19:58 PM IST

ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీ టీడీపీ ల నడుమ పెద్ద యుద్ధమే నడుస్తుంది. మూడు రాజధానుల అంశం చుట్టూతా ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడు రాజధానుల వద్దని మొదటి నుంచి ప్రతిపాదించిన అమరావతే రాజధానిగా ఉండాలని టీడీపీ నాయకులు సహా అధినేత చంద్రబాబు కూడా గట్టిగా డిమాండ్ చేసారు. అలాగే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వచ్చి ప్రజా క్షేత్రం లోనే తేల్చుకుందామని సవాలు విసిరారు.

కానీ అందుకు వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే దానిని జగన్ ఆ నిర్ణయం తీసుకునే సాహసం చెయ్యలేని విధంగా పరిగణించి గడువును మరోసారి గుర్తు చేసారు. జగన్ ఈ సవాలును స్వీకరించకపోవడంతో ఈరోజు సాయంత్రం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి తన స్పందనను తెలియజేయనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో చాలా గట్టిగానే వైసీపీ అధిష్టానానికి కౌంటర్లు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి బాబు ఎలాంటి విమర్శలు కురిపిస్తారో చూడాలి.