షాకింగ్ : జగన్ – బీజేపీ ఒక్కటే అంటున్న ఆ నేత.!

Saturday, August 1st, 2020, 08:00:54 AM IST

ఇటీవలే ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ నుంచి మూడు రాజధానులకు ఆమోదం తెలపడంతో మరోసారి ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. దీనితో ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులు వద్దని మరోసారి వైసీపీ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు.

జగన్ కి బీజేపీ కి మంచి సంబంధాలు ఉన్నాయని ఒకరిని ఒకరు కాపాడుకుంటారని, జగనే ఒకప్పుడు అన్నాడు తాను ఎప్పుడు బీజేపీ కి వ్యతిరేఖం కాను అని అలా ఈ మూడు రాజధానులు అంశం విషయంలో బీజేపీ జగన్ కే మద్దతు ఇస్తుంది అని వ్యాఖ్యానించారు.జగన్ ఇచ్చే ఫైల్ దేనికైనా సరే బీజేపీ ఆమోదం తెలుపుతుంది అని జగన్ బీజేపీ ఒక్కటే అని సంచలన కామెంట్స్ చేశారు.