నిమ్మగడ్డ వ్యవహారంపై సీఎం జగన్‌కి మాజీ సీఎస్ ఐవైఆర్ సలహా..!

Monday, June 1st, 2020, 06:07:48 PM IST

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హాట్‌టాఫిక్‌గా మారింది. నిమ్మగడ్డ కేసులో హైకోర్ట్ తీర్పును వ్యతిరేకించిన ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్‌కి వెళ్ళేందుకు సిద్దమయ్యింది. అయితే నిమ్మగడ్డ విషయంలో అటు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నిమ్మగడ్డ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. హైకోర్టు ఆదేశించినా నిమ్మగడ్డను ఎందుకు ఎన్నికల కమీషనర్‌గా తిరిగి చేర్చుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొన్ని విషయాలు తెగేదాక లాగితే ఫలితాలు ప్రతికూలం అవుతాయని, రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఉన్నది అంటూ ట్వీట్ చేశారు.