పీఎస్ఎల్వివి – సీ 51 ప్రయోగం విజయవంతం

Sunday, February 28th, 2021, 01:30:13 PM IST

నెల్లూరు జిల్లా శ్రీహరి కోట లోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఇస్రో చేపట్టిన పీ ఎస్ ఎల్ వీ – సీ 51 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. దేశీయ, ప్రైవేట్ సంస్థలకు చెందినటువంటి 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్య లోకి ప్రవేశపెట్టిన విషయాన్ని ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. అయితే ప్రయోగ వేదిక నుండి రాకెట్ 17 నిమిషాల పాటు పయనించి బ్రెజిల్ కి చెందిన అమోజోనియా శాటిలైట్ ను నిర్ణీత కక్ష్య లోకి ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం కాగా, మొదటి ప్రయోగ వేదిక నుండి 39 వ ప్రయోగం. అయితే ఉప గ్రహం ద్వారా మోడీ పేరు, ఫోటో ను అంతరిక్షం లోకి పంపారు. మోడీ ఫోటో, పేరు, ఆత్మ నిర్భర భారత్ మిషన్ పేరు, భగవద్గీత కాపీ, వెయ్యి మంది విదేశీయుల పేర్లు, చెన్నై కి చెందిన విద్యార్థుల పేర్లను అంతరిక్షం లోకి పంపినట్లు ఇస్రో తెలిపింది. అయితే ఈ మేరకు ఇస్రో చైర్మన్ శివన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఇస్రో, బ్రెజిల్ తో చేపట్టిన మొదటి ప్రయోగం గర్వం గా ఉందని పేర్కొన్నారు.