వకీల్ సాబ్ మరింత ఆలస్యం కానుందా?

Wednesday, November 18th, 2020, 04:10:06 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా విరామం తీసుకొని సినిమాల్లో నటించేందుకు సిద్దం అయి, రీఎంట్రీ ప్రాజెక్ట్ ను వకీల్ సాబ్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఊహించిన విధంగా కరోనా వైరస్ మహమ్మారి కారణం గా లాక్ డౌన్ తో సినిమా చిత్రీకరణ వాయిదా పడటం మాత్రమే కాకుండా, విడుదల కి కూడా నోచుకోలేదు. అయితే లాక్ డౌన్ సడలింపులతో సినిమా లను మళ్లీ సెట్స్ పైకి తీసుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు.

అయితే వకీల్ సాబ్ ను బోని కపూర్ తో కలిసి నిర్మిస్తున్న దిల్ రాజు కి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రమే కాకుండా, తాను కూడా కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. అయితే ఈ నేపథ్యం లో డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సిన వకీల్ సాబ్ ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ అయ్యాక, సినిమా ను సెట్స్ మీదికి తీసుకొచ్చిన టీమ్ మోషన్ పోస్టర్ విడుదల చేసి సంక్రాంతి కి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రం విడుదల ఇంకాస్త వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.