నాని – నజ్రియా కాంబో లో తెరకెక్కనున్న చిత్రానికి టైటిల్ ఇదేనా?

Tuesday, November 17th, 2020, 11:20:44 AM IST

న్యాచురల్ స్టార్ నాని ఏ సినిమా చేసినా కాస్త ఆలోచించే చేస్తారు. ప్రేక్షకులకు వినోదం అందించడం లో ఎంతో కష్ట పడతారు. అయితే భిన్న కథాంశాలతో ముందుకు వస్తున్న నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరొక ఆసక్తికర సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం లో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహడ్ కథానాయికగా నటించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ఈ నెల 21 న ప్రకటించనున్నట్లు తెలిపింది. అయితే ఈ టైటిల్ ఏమై ఉంటుందా అంటూ పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ లో ప్రస్తావించిన అంశాలను బట్టి, ఫిలిమ్ నగర్ లో సైతం ఒక టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి “అంటే సుందరానికి” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ప్రేమ కథ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ ఏడాది వి లాంటి రివెంజ్ డ్రామా తో అలరించిన నాని, టక్ జగదీష్ చిత్రం తో త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్నారు. వరుస సినిమాలు చేస్తూ నాని కెరీర్ పరంగా దూసుకు పోతున్నారు.