బిగ్ న్యూస్: రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఇవేనా?

Tuesday, December 15th, 2020, 12:40:44 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం సిద్దం అయింది. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తా అంటూ అధికారికంగా ప్రకటించిన రజినీ, తన పార్టీ పేరు మరియు గుర్తు ల పై సోషల్ మీడియఓ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి నెలలో పార్టీ ను ప్రారంభిస్తా అని తెలిపిన రజినీ, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన డిసెంబర్ 31 న చేస్తా అని అన్నారు.

అయితే రజనీకాంత్ పెట్టబోతున్న పార్టీ పేరు ఇదే అంటూ సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతోంది. మక్కల్ సేవై కట్చి పేరుతో రజినికాంత్ ఎన్నికల సంఘం లో పార్టీ పేరు ను నమోదు చేసినట్లు సమాచారం. అదే విధంగా పార్టీ గుర్తు ఆటో ను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే వీటి పై ఇంకా స్పష్టత రాలేదు.