సంక్రాంతి సీజన్ లో రావటం ‘ఎన్టీఆర్’ కు మంచిదేనా..?

Friday, January 8th, 2016, 12:58:00 PM IST


ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల సందడి ఎక్కువగానే ఉండనుంది. అలాగే పోటీ కూడా. ముఖ్యంగా బాలకృష్ణ ‘డిక్టేటర్’, ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి భారీ చిత్రాలు పోటీలో ఉన్నాయి. కాబట్టి కాస్త అటు ఇటు అయినా సినిమా తేలిపోవటం ఖాయం. ఒకవేళ అన్ని సినిమాలు బాగానే ఉన్నా ఓపెనింగ్ కలెక్షన్ల విషయంలో ఖచ్చితంగా భారీ స్థాయిలో తేడా ఉంటుంది. ఈ మూడు సినిమాల్లోనూ 13న రిలీజ్ కావాల్సిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో బడ్జెట్ 50 కోట్లకు పైమాటే.

ఇంతటి బడ్జెట్ ను రాబట్టాలంటే భారీ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు రావాలి. కలెక్షన్లు రావాలంటే పోటీ తక్కువగా ఉండాలి. పైగా ఈసారి ఎన్టీఆర్ సరికొత్త స్టైల్లో, వైవిధ్యమైన కధతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇదో ప్రయోగమే. కాబట్టి ప్రమాదం కూడా ఎక్కువే. అసలు సినిమాలో ఉన్న కంటెంట్ జనాలకు కనెక్టైతే ఇవేమీ పెద్ద సమస్య కాదు. కానీ కనెక్ట్ అవ్వటమే కష్టం. ఇంకో వైపు డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు పెద్ద బడ్జెట్ సినిమాలే అయినప్పటికీ మరీ అంత హెవీ బడ్జెట్ సినిమాలు కాదు. పైగా వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండి మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కావటం వల్ల వాటికొచ్చిన నష్టమేమీ లేదు. అవి ఎలాగోలా కలెక్షన్లు రాబట్టుకుంటాయి. సమస్యల్లా నాన్నకు ప్రేమతో సినిమాకే. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ రిస్క్ చేయటం అంత మంచిది కాదని సినీ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. చూడాలి నాన్నకు ప్రేమతో టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.