నెటిజన్ల కి చిక్కిన జక్కన్న… ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ కాపీనట!

Tuesday, January 26th, 2021, 10:42:07 PM IST

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధీరం. ఈ చిత్రం లో మొదటి సారిగా ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ఇప్పటికే విడుదల అయిన టీజర్స్ మరియు పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ను ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. అయితే పోస్టర్ కి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. రామ్ చరణ్ గుర్రం పై స్వారీ చేస్తూ, ఎన్టీఆర్ బుల్లెట్ ను నడుపుతూ స్టైలిష్ గా మాస్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాయి.

అయితే ఈ పోస్టర్ కాపీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఘోస్ట్ రైడర్ చిత్రం హాలీవుడ్ నాట బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్, ఆర్ ఆర్ ఆర్ కి చెందిన పోస్టర్ ఒకేలా ఉన్నాయి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి బాహుబలి చిత్రం తో పాన్ ఇండియా దర్శకుడు గా ఎదగడం మాత్రమే కాకుండా, టాలీవుడ్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చారు. అయితే గతంలో కూడా ఇలా కాపీ మరకులు రాజమౌళి కి అంటుకున్నాయి. మరోమారు ఇలా దొరకడం తో కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 న థియేటర్ లలో కి తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం లో బాలీవుడ్ ప్రముఖులు అలియా భట్,అజయ్ దేవగన్ లు కూడా నటిస్తున్నారు. ఇటు శ్రియ శరణ్, సముద్ర ఖని లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.