అఖిల్ తో రొమాన్స్ చేయనున్న రష్మీక

Sunday, November 22nd, 2020, 06:32:00 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో అక్కినేని అఖిల్ హీరో గా ఒక చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ చిత్రం లో పలు కీలక పాత్రలు కోసం దర్శకుడు వేట మొదలు పెట్టారు. అయితే ఇదే క్రమంలో అఖిల్ సరసన హీరోయిన్ గా నటించేందుకు సురేందర్ రెడ్డి ఒక బ్యూటీ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అక్కినేని అఖిల్ కోసం కన్నడ బ్యూటీ రష్మీక ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా చర్చల దశలోనే ఉందని, ఒక వేళ ఇదే నిజం అయితే వెండి తెర పై మరొక క్రేజీ కాంబినేషన్ ను అభిమానులు చూసే అవకాశం ఉంది. అయితే అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం లో అఖిల్ సరసన పూజ హెగ్డ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా రష్మిక అటు బన్నీ సరసన పుష్ప చిత్రం లో, ఇటు శర్వానంద్ తో ఆడోళ్లు మీకు జోహార్లు చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక తమిళ్ చిత్రం లో కూడా నటిస్తూ రష్మీక బిజీగా ఉన్నారు.