పవర్ ఫుల్ టైటిల్ తో పవర్ స్టార్ సినిమా

Tuesday, February 2nd, 2021, 06:33:33 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకి దూరం అయ్యారు. అయితే వకీల్ సాబ్ అంటూ మళ్ళీ మూడేళ్ల తర్వాత ప్రేక్షకులను పలకరించేందుకు ఏప్రిల్ 9 న థియేటర్ల లోకి వస్తున్నారు. అయితే ఈ చిత్రం తో పాటుగా పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. అయ్యప్పనుమ్ కోషీయం చిత్రం రీమేక్ లో నటిస్తున్నారు పవన్. భల్లాల దేవ, దగ్గుబాటి రానా తో కలిసి నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం అనంతరం పవన్ క్రిష్ దర్శకత్వంలో నటించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

క్రిష్ పవన్ కలయిక లో సినిమా వస్తుంది అని తెలిసినప్పటి నుండి అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ దొంగ గా కనిపించనున్నారు. అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను కన్ఫర్మ్ చేయలేదు చిత్ర యూనిట్. అయితే ఇప్పటికే విరూపాక్ష, బందిపోటు, గజదొంగ, ఓం శివం అనే టైటిల్స్ వినిపించాయి. అయితే తాజాగా వీరి కలయిక లో వస్తున్న చిత్రానికి టైటిల్ ఇదే అంటూ ఫిల్మ్ నగర్ లో చర్చలు జరుగుతున్నాయి. హరిహర వీరమల్లు అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ టైటిల్ పవర్ ఫుల్ గా ఉండటం తో ఇది ఫిక్స్ అంటూ కొందరు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా, సంగీతం కీరవాణి అందిస్తున్నారు.