ప్రభాస్ కోసం ఈ డైరెక్టర్ ఇంకో రెండేళ్లు ఆగల్సిందేనా?

Thursday, November 19th, 2020, 05:10:38 PM IST

ప్రభాస్ తో సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు సమయం పడుతుంది ఇప్పుడు. వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో ప్రభాస్ దూసుకు పోతున్నారు. ఈ క్రమంలో న్ ఆదిపురుష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అయితే ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతేకాదు దర్శకుడు ఓం రౌత్ నేడు విడుదల తేదీ ప్రకటించడం తో నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం మరో రెండేళ్లు వేచి చూసే పరిస్తితి ఏర్పడింది అని చెప్పాలి.

ప్రభాస్ కి స్టోరీ చెప్పి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది నాగ్ అశ్విన్ కి. అంతేకాక దీపికా పడుకొనే హీరోయిన్ గా అధికారిక ప్రకటన కూడా చేసేశారు. అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని క్రమంలో ఉన్న రాధే శ్యామ్ అనంతరం వచ్చే ఏడాది జనవరి నుండే ప్రభాస్ ఆది పురుష్ లో నటించేందుకు సిద్దం అయ్యారు. అయితే ఈ నిర్ణయం తో నాగ్ అశ్విన్ మరో రెండేళ్ల సమయం వేచి చూడాల్సిందే. అయితే ఈ లోపు మరో కథ తో ప్రేక్షకులు ముందుకి వస్తాడా లేకపోతే ప్రభాస్ తో సినిమా అయ్యాక వేరే సినిమా మొదలు పెడతాడా అనేది ఇప్పుడు చర్చంశ నీయం అయింది.