ఆదిపురుష్ లో బాలీవుడ్ టాప్ హీరోయిన్?

Monday, December 28th, 2020, 12:37:34 PM IST

యంగ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ వరుస చిత్రాలు చేసుకుంటూ బిజీ గా గడిపేస్తున్నారు. రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తి కావస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనంతరం ఆదిపురుష్ లో నటించనున్నారు. అయితే ఈ చిత్రం లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. రావణుడి పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ ను తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం లోకి బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన కాజోల్ ఈ చిత్రం లో నటించనున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రం లో కాజోల్ ఒక కీలక పాత్ర పోషించనున్నారు అని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ మీడియా సైతం ఇందుకు సంబంధించిన పలు వార్తలను రాస్తోంది. అయితే ప్రభాస్ ఆడిపురుష్ చిత్ర యూనిట్ కానీ, అటు కాజోల్ కానీ ఈ విషయాల పై ఇంకా స్పందించలేదు. అయితే ఇప్పటికే సౌత్ లో ధనుష్ తో ఒక చిత్రం లో నటించిన కాజోల్ పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో అవకాశం వస్తే వెనకడుగు వేసే అవకాశం కూడా లేదు అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో కాజోల్ నటిస్తారా లేదా అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.