గర్భంతో ఉండి మద్యం సేవిస్తే.. ?

Thursday, February 25th, 2016, 04:02:18 PM IST


మారుతున్న కాలంతో పాటు పురుషులతో సమానంగా మహిళలు కూడా ఎదుగుతున్నారు. పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా.. వారితో సమానంగా అన్ని రంగాలలో ముందుకు పయనిస్తున్నారు. మద్యం విషయంలో కూడా మహిళలు పురుషులతో పాటు కూర్చొని ఫ్యాషన్ అని తీసుకుంటున్నారట. మామూలు సమయాలలో తీసుకుంటే ఫర్వాలేదుకాని, గర్భం దాల్చినపుడు కనుక మహిళలు మద్యం సేవిస్తే.. వారిపు పుట్టిబోయే పిల్లలు.. వారిపిల్లలు అలా మూడు తరాల పిల్లలకు మద్యం సేవించే అలవాటు వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.

ప్రస్తుతానికి ఈ విషయంపై ఎలుకలలో ప్రయోగం నిర్వహించారు. అయితే, ఎలుకలలో ఈ ప్రయోగం సక్సెస్అయింది. 17 రోజుల గర్భంతో ఉన్న ఎలుకకు నాలుగురోజులపాటు వైన్ అందించారు. ఇక తరువాత దానికి పుట్టిన పిల్లలకు వైన్ అందించినా దాని ప్రభావం వాటిలో పెద్దగా కనబడలేదని పరిశోధకులు చెప్తున్నారు. గర్భంలో ఉండగా మద్యానికి తట్టుకునే శక్తి వాటికి వస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.