2021 ఐపియల్ తో ధోనీ క్రికెట్ కి గుడ్ బై చెప్పనున్నాడా?

Tuesday, December 29th, 2020, 03:43:58 PM IST

మునుపెన్నడూ లేని విధంగా ఇండియా ను నెంబర్ వన్ స్థానం లో ఉంచిన ధోనీ ఐపియల్ కి కూడా గుడ్ బై చెప్పనున్నారా? అంటూ అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నేశనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐపియల్ కి కూడా వచ్చే ఏడాది గుడ్ బై చెప్పనున్నారు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పలువురు ఈ వార్తను నిజమే అంటూ చెప్పుకొస్తున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం ధోనీ కి వచ్చే ఏడాది జరిగే ఐపియల్ 2021 చివరిది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఇదివరకే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్ మెంట్ ఐపియల్ 2023 లేదా 2024 వరకు ధోనీ ఆడతాడు అంటూ చెప్పుకొచ్చింది. మరి దీని పై ఇటువంటి వార్తలు రావడం పట్ల అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీని పై మరొకసారి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.