“కేజీఎఫ్ ఛాప్టర్ 2” లో క్లైమాక్స్ ఫైట్ కీలకం కానుందా?

Monday, December 7th, 2020, 05:03:43 PM IST

కేజీఎఫ్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, కేజీఎఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం లో యశ్ నటన మాత్రమే కాకుండా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం కి ప్రేక్షకుల్లో మాంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రం కోసం ఇప్పటికే అన్ని భాషలకు చెందిన ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. క్లైమాక్స్ చిత్రీకరణ లో ప్రస్తుతం బిజీ గా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే క్లైమాక్స్ ఫైట్ లో యశ్ మరియు సంజయ్ దత్ ల పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉందనున్నట్లు తెలుస్తోంది. అధీరా పాత్ర లో సంజయ్ దత్ చాలా బ్రూటల్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి పార్ట్ లో యశ్ నట విశ్వరూపం చూపించారు. అయితే వీరిద్దరీ ఫైట్ అనేది ఈ సినిమా కి హైలెట్ అని తెలుస్తోంది. ఇందుకోసం డెడ్లీ ఫైట్ మాస్టర్స్ అయిన అన్ భరివ్ లను ప్రశాంత్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ వచ్చే ఏడాది జనవరి 8 న యశ్ పుట్టిన రోజున విడుదల కానుంది. ఈ చిత్రం లో యశ్ సరసన కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, రావు రమేష లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.