చంద్రబాబు రాజీనామాల ప్లాన్ వెనుక కిటుకు ఇదేనా..?

Tuesday, August 4th, 2020, 08:00:42 AM IST

ఇప్పుడు ఏపీలో మూడు రాజధానులు మాట మూడు ముక్కలాటలా మూడు ప్రధాన పార్టీల నడుమ చాలా రసవత్తరంగా నడుస్తుంది. ఇప్పటికే మూడు పార్టీల యొక్క స్టాండ్ ఏమిటి అన్నది వరుసగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

అయితే ఈ మూడు రాజధానులు అంశం ఇంతలా హైలైట్ అవ్వడానికి ప్రధాన కారణం అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే చంద్రబాబు వైసీపీను ఉద్దేశించి మూడు రాజధానులు ఎజెండా నిజం అయితే అసెంబ్లీ ని రద్దు చేయండి రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజా క్షేత్రం లోనే తేల్చుకుందాం అని అంటున్నారు.

ఈ మాటలు వినడానికి బాగున్నా దీని వెనుక అసలైన మర్మం ఇంకోటి ఉంది అనిపిస్తుంది. బాబు రాజకీయాల కోసం తెలిసిందే. ఇప్పుడు ఎలాగో పరిస్థితులు బాలేవు కనుక అసలు ఎన్నికలు జరిగే సమస్యే లేదు. మరి అలాంటప్పుడు వీరు రాజీనామాలు చేసి ఏం లాభం? అందుకే ఇదంతా ఒక డ్రామాను తలపిస్తుంది తప్ప మరొకటి కాదు. మరి ఏ పార్టీ అభిమానులు వాళ్ళేదో చెప్పేసారు అని డబ్బాలు కొట్టుకోడం ఆపి రియాలిటీ ను గుర్తుంచుకుంటే మంచిది.