ఐపియల్: నేడు ఫైనల్ కి వెళ్ళబోయేది ఎవరు?

Thursday, November 5th, 2020, 04:30:36 PM IST

లీగ్ మ్యాచ్ లు పూర్తి అయి, ప్లే ఆఫ్ సమరానికి సిద్దంగా ఉన్నాయి.ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్, సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. నేడు తోలి క్వాలిఫైయర్ ముంబై కి మరియు ఢిల్లీ క్యాపిటల్స్ కి మధ్య జరగనుంది. అయితే ముంబై అయిదో సారి టైటిల్ నెగ్గెందుకు సిద్దంగా ఉండగా, ఇటు ఢిల్లీ రెట్టింపు ఉత్సాహం కనబరిచి ఈ సారైనా ఫైనల్ కి చేరాలని చూస్తోంది.

అయితే ఈ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ డైరెక్ట్ గా ఫైనల్ కి చేరుకుంటోంది. ఓడిపోయిన టీమ్ కి మరొక అవకాశం ఉండనుంది. క్వాలిఫైయర్ 2 విన్నర్ తో తలపడే అవకాశం ఉంది. అయితే నేడు మ్యాచ్ లో ముంబై ఫేవరెట్ గా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి నుండి ఎక్కువ విజయాలను నమోదు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ అన్నిట్లో కూడా ముంబై స్ట్రాంగ్ గానే ఉందని చెప్పాలి. అయితే ఢిల్లీ టీమ్ ఆధిపత్యం చెలాయిస్తున్న ప్పటికి కూడా తడబడుతూ వస్తుంది. మరి ఈ క్వాలిఫై యర్ లో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలి అంటే కొద్ది సేపు వేచి చూడాల్సిందే.