అధునాతనమైన టెక్నాలజీ తో 5జీ ఐఫోన్ 12

Wednesday, October 14th, 2020, 02:09:39 PM IST

ఐఫోన్ యూజర్లకి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. అధునాతనమైన టెక్నాలజీ తో 5 జీ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మిని, ఐఫోన్ 12 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ లను ఆపిల్ సంస్థ ఆవిష్కరించడం జరిగింది. అయితే ఐఫోన్ 12 మినీ ధర 699 డాలర్ల నుండి ప్రారంభం కానుంది, అనగా 69,900 రూపాయలు, దీని సైజ్ 5.4 అంగుళాలు. అయితే ఐఫోన్ 12 ధర 799 డాలర్లు (79,900 రూపాయలు) నుండి ప్రారంభం కానుంది. దీని స్క్రీన్ పరిమాణం 6.1 అంగుళాలు. ఐపోన్ 12 ప్రో ధర 1,19,900 కాగా, దీని స్క్రీన్ పరిమాణం 6.1 అంగుళాలు. అయితే ప్రో మాక్స్ ధర 1,29,900 కాగా, దీని స్క్రీన్ 6.7 అంగుళాలు గా ఉంటుంది.

అయితే ఐఫోన్ 11 తో పోల్చితే ఇది చాలా మెరుగైనది అని తెలుస్తోంది. 11 శాతం స్లిమ్ గా,16 శాతం తేలికగా ఉంటుంది. 11 తో పోల్చితే ఇందులో రెట్టింపు పిక్సెల్స్ ఉంటాయి. శేరమిక్ షీల్డ్ తో చేయబడినది. అయితే స్మార్ట్ డేటా మోడ్ ఆధారం గా 5 జి మరియు ఎల్ టీ ఈ నెట్ వర్క్ పై పని చేస్తున్నట్లు తెలిపారు. అయితే అక్టోబర్ 16 నుండి ప్రి ఆర్డర్లు పెట్టేందుకు అవకాశం ఉండగా, 23 నుండి డెలివరీ లు ప్రారంభం కానున్నాయి.