ఆ చర్చ్‌కి తిరుపతిని మించిన ఆదాయం.. భయటపడ్డ అసలు నిజం..!

Wednesday, December 18th, 2019, 06:42:06 PM IST

ప్రపంచంలోనే అత్యధిక ఆదాయమున్న మిషనరీలలో అమెరికాలోని రోమన్ కాథలిక్ చర్చ్ మొదటి స్థానంలో ఉండగా, హిందూ దేవాలయాలలో అనంత పద్మనాభ స్వామి, తిరుపతి దేవస్థానాలు ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీటి తరువాత అత్యంత ఆదాయమున్న మరో మిషనరీ చర్చ్ పేరు తెర మీదకు వచ్చింది.

అమెరికాలోని జీసస్ క్రిస్ట్ ఆఫ్ లాటర్ డే సైంట్స్ అనే మిషనరీ సంస్థకు కూడా లెక్కలేనన్ని విరాళాలు వస్తున్నాయని ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఐఆర్ఎస్ వారికి ఫిర్యాదు చేశారు. అయితే మిషనరీ కాబట్టి ఇప్పటివరకు ఆ చర్చ్ ఆదాయాన్ని అధికారికంగా భయటపెట్టలేదు. అయితే దీనిపై తాజాగా ఐఆర్ఎస్ ఆరా తీయగా ఆ మిషనరీకి ఇప్పటి వరకు సుమారుగా 71 వేల కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారికంగా తేలింది. అయితే తిరుమల క్షేత్రానికి గరిష్టంగా గత ఏడాది 2018-19 సంవత్సరానికిగాను 2,894 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ చర్చ్ ఆదాయ లెక్కలను చూస్తుంటే తిరుపతిని మించిన ఆదాయం వచ్చినట్టు అర్ధమవుతుంది.