ఆంధ్ర ప్రదేశ్ లో వాయిదా పడ్డ ఇంటర్ పరీక్షలు… విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన!

Sunday, May 2nd, 2021, 10:00:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇంటర్మీడియట్ పరీక్షలు ఎట్టకేలకు వాయిదా పడ్డాయి. అయితే ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయం లో పునరాలోచన చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచించడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సైతం పరిగణన లోకి తీసుకున్నట్లు గా మంత్రి తెలిపారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తేదీలను ప్రకటిస్తాం అని మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే పిల్లల ప్రాణాల మీద, వారి భవిష్యత్ మీద మమకారం, బాధ్యత ఉన్న ప్రభుత్వం గా సురక్షిత వాతావరణం లో పరీక్షలు నిర్వహించాలని అనుకున్నాం అని అన్నారు. అయితే ఇందుకోసం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పారు. అయితే దేశం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటం, తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండటంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.