క్రిష్ సినిమా నుండి మరొక కీలక అప్డేట్!

Thursday, October 8th, 2020, 08:20:49 PM IST

భిన్న కథాంశాలతో తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించే జాగర్లమూడి రాధాకృష్ణ, తన సినిమా కోసం ఫుల్ ప్లాన్ లో ఉన్నారు. క్రిష్ ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎల్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సైతం ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ చిత్రం ఎల్ ఒక కీలక పాత్ర కోసం దర్శకుడు క్రిష్ దగ్గుబాటి రాణ ను సంప్రదించినట్లు సమాచారం.అయితే అందుకు రానా ఓకే చెప్పారా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ రాణా ఈ చిత్రాన్ని అంగీకరిస్తే మరొక స్థాయికి వెళ్ళడం ఖాయం. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కోణం వివాదం కారణం గా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ చేరిక తో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.