కరోనా మాయ : రెస్టారెంట్లలో వినూత్న పద్దతి – కస్టమర్లకు ట్యూబులు…?

Tuesday, May 19th, 2020, 05:30:18 PM IST

గత కొంత కాలంగా మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ కరోనా నివారణ చర్యల్లో భాగంగా కొందరైతే పలు వినూత్న పద్దతులను పాటిస్తున్నారు. కాగా ప్రజలందరిలో కూడా సామాజిక దూరం తప్పని సరి అని అని ఒక రెస్టారెంట్ యజమానులు ఒక వినూత్న పద్దతికి నాంది పలికారు. కాగా అమెరికా లోని మేరీలాండ్‌, ఓషన్ సిటీలో, ఫిష్ టేల్స్ రెస్టారెంట్ లలో యజమానులు, అక్కడికి వచ్చే కస్టమర్లకు ఇన్‌ఫ్లాటబుల్ ట్యూబులు ఇస్తోంది. వాళ్లు ఆ ట్యూబులో దూరాల్సి ఉంటుంది. ఆ ట్యూబులకు కింద చక్రాలు ఉండటం వలన వాటిని తోసుకుంటూ వెళ్లే ఆస్కారం ఉంటుంది.

అంతేకాకుండా ఆ రెస్టారెంట్లలో ప్రత్యేకమైన టేబుల్స్ ఏమి ఉండవు. ఆ ట్యూబుకు ఉన్నటువంటి దానిపైన టేబుల్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటి దగ్గర నిల్చొనే తినాల్సి ఉంటుంది. కాగా ఈ పద్దతి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ కూడా కరోనా తీవ్రతనేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని యజమానులు వెల్లడించారు. ఇకపోతే థాయిలాండ్ లోమాత్రం ఒక రెస్టారెంట్లో టేబుళ్ల దగ్గర పాండా బొమ్మలను పెట్టింది. అలా చేయడం వలన టేబుల్‌పై ఎవరూ కూర్చునే అవకాశం ఉండకపోవడంతో సామాజిక దూరాన్ని పాటించే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని రెస్టారెంట్ యజమానులు వెల్లడించారు. కాగా ప్రస్తుతానికి వీటికి సంబందించిన వీడియోలు సామాజిక మాంద్యమాల్లో వైరల్ అవుతున్నాయి.