ఇండోనేషియా విమానం ఆచూకీ లభ్యం!

Monday, December 29th, 2014, 03:47:45 PM IST


ఇండోనేషియా సురబయ నుండి సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఏషియా క్యూజెడ్ 8501 విమానం ఆదివారం అదృశ్యమైన సంగతి తెలిసిందే. కాగా ఈ విమానానికి సంబంధించిన శకలాలను జావా సముద్రంలో గుర్తించినట్లుగా స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. అయితే ఇండోనేషియా నుండి సింగపూర్ కు విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానాశ్రయంలోని ఏసీటీ కేంద్రం నుండి సంబంధాలు తెగిపోయాయి. ఇక అప్పటి నుండి ఇండోనేషియా ప్రభుత్వం గాలింపు చర్యలను తీవ్రతరం చేస్తూనే ఉంది.

కాగా అందులో భాగంగా ఎయిర్ ఏషియా విమాన శకలాలు జావా సముద్రంలో ఉన్నట్లు గాలింపు చర్యలు చేపట్టిన బృందాలు తెలిపినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది. ఇక విమానంలో 155మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ప్రయాణిస్తుండడంతో మొత్తం 162మంది మరణించారని మీడియా పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఇంకా ప్రభుత్వం ద్రువీకరించాల్సి ఉంది.