ఇది చూసి కూడా మీరు చైనా వస్తువులను కొంటారా.?

Thursday, July 9th, 2020, 09:09:37 AM IST

ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు మీరు కూడా దారుణ పరిస్థితులు ఎదుర్కోడానికి ఏకైక కారణం చైనా.. అక్కడ ఎవరో తిన్న గబ్బిలం దెబ్బకు మనిషి ప్రశాంతంగా మునుపటిలా జీవించి చాలా కాలం అయ్యిపోయింది. దీనితో అన్ని దేశాల వారు చైనా దేశం అంటే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

ఇప్పటికే పలు దేశాలు ఆ దేశంతో ఉన్న సంబంధాలను తెంపుకుని వారి వస్తువులను నిషేధించారు. కానీ మనకు ఎంతో నష్టం కలిగించిన చైనా దేశపు మార్కెట్ మాత్రం ఇంకా బాగానే నడుస్తుంది. వారి ప్రొడక్ట్ లు లాంచ్ అవుతున్నాయి. సేల్స్ జరుగుతున్నాయి మనవాళ్ళు కూడా ఏమాత్రం ఆలోచించకుండా కొంటున్నారు.

కరోనా తో ఇంత ఇబ్బందులు పడినా వారిని క్షమించాం. కానీ దేశ సరిహద్దుల్లో ఇలాంటి దారుణ పరిస్థితులలో కూడా మన సైనికులను అకారణంగా చైనా పొట్టన పెట్టుకుంది. దీనితో వారి యాప్స్ ను శాశ్వతంగా భారత్ ప్రభుత్వం నిషేధించింది. దీనితో వారు అక్కడ ఉన్న మన దేశస్థులను కనీసం వారి రెస్టారెంట్ల లోకి కూడా రానివ్వటం లేదట. నిర్మొహమాటంగా బోర్డ్ పెట్టి మరీ భారతీయులకు మా రెస్టారెంట్ లోకి ప్రవేశం లేదు అని వారు రాశారు.

వారి యాప్స్ ని బ్యాన్ చేసినందుకే వాళ్ళకి అంత పౌరుషం వచ్చి మన వాళ్ళని తిండి తినడానికి కూడా రానివ్వటం లేదు. కానీ మన వాళ్ళు మాత్రం వాళ్ళ కొత్త ప్రొడక్ట్స్ ఎప్పుడు వస్తాయా అని ఇప్పటికీ కొంటూనే ఉన్నారు. ఇది మన దౌర్భాగ్య పరిస్థితి. ఇది చూసాక కూడా చైనా కు మేలు చెయ్యాలని చూస్తే వారికి వారికి మనకి పెద్ద తేడా ఉండదు.