సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇండియన్ స్పైడార్మెన్ విన్యాసం..!

Thursday, June 4th, 2020, 01:01:45 AM IST


గాలిలో రాకెట్ స్పీడుతో దూసుకుపోవడం, పెద్ద పెద్ద బిల్డింగులు, చెట్లు అలవోకగా ఎక్కడం వంటి విన్యాసాలు టీవీలలో, సినిమాలలో ఏ స్పైడార్మెనో లేక సూపర్ మేనో చేస్తుంటే చూసుంటాం.

అయితే అలాంటి విన్యాసం ఓ సాధారణ మనిషి చేసాడు. మహారాష్ట్రలో వచ్చిన నిసర్గ్ సైక్లోన్ కారణంగా ఓ షాపు ముందు ఉన్న షెడ్డు పైపును పట్టుకుని ఓ వ్యక్తి నిలబడి ఉండగా ఆ షెడ్డు ఒక్కసారిగా పైకి లేచింది. ఆ తరువాత వెంటనే ఆ వ్యక్తి స్పైడార్మెన్ లాగా అలవోకగా కిందకు దిగి వచ్చాడు. అయితే ఆ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.