నరనరాన భారతీయతే..

Friday, September 19th, 2014, 06:50:51 PM IST


భారతదేశంలోని ముస్లింలు భారతదేశం కోసం ఏదైనా చేస్తారు.. వారి గుండెల నిండా భారతీయతఉన్నదని భారత ప్రధాని నరేంద్ర మోడీ సిఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ వ్యాఖ్యానించారు. భారతీయ ముస్లింలను ఆల్ ఖైదా ప్రేరేపిస్తుందని ఇటివలే విడుదలైన ఓ వీడియోపై భారతప్రధాని పై విధంగా స్పందించారు. భారతీయ ముస్లిం సోదరులు దేశం కోసమే బ్రతుకుతారని.. దేశంకోసమే మరణిస్తారని.. వారు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరని.. అటువంటి ఆలోచనలు కూడా వారికి రావని.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొంతమంది దేశంలోని ముస్లింలను చట్టవిరుద్దమైన కార్యకలాపాలకు వాడుకోవాలని చూస్తుందని.. అది వారికి కలగానే మిగిలిపోతుందని అన్నారు. ముస్లింలు భారతదేశంలో ఒక జాతి అని.. వారు సమయానుకూలంగా ఎటుబడితే అటు మారేవారు కారని మోడీ స్పష్టం చేశారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, కావాలని కయ్యానికి కాలుదువ్వితే.. చూస్తూ ఊరుకోబోమని మోడీ హెచ్చరించారు.