డిజిటల్ డీల్స్‌కు మక్కువ చూపుతున్న భారతీయ ఐటీ సంస్థలు..!

Tuesday, August 25th, 2020, 12:47:33 PM IST

కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో అనేక రంగాలతో పాటు ఐటీ రంగం కూడా కుదేలయ్యింది. పెద్ద పెద్ద కంపెనీలు మినహా చాలా ఐటీ కంపెనీలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఎంప్లాయిస్‌ని తగ్గించుకోగా, మరికొన్ని కంపెనీలు హోల్డ్‌లో ఉంచాయి. అయితే కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు భారతీయ ఐటీ సంస్థలు డిజిటల్ డీల్స్‌కు ఎక్కువగా మక్కువ చూపుతున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఐటీ సంస్థలు వారి కార్యాలయాలను మార్చుకోవడం, ఖర్చులు తగ్గించడం మరియు ప్రాజెక్టులను ఆటోమేట్ చేయడం వంటివి చేసుకుంటున్నట్టు సమాచారం. అంతేకాదు ఈక్విరస్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం గత మూడు నెలలుగా టెక్నాలజీ సేవల సంస్థల వ్యాఖ్యానం వేగంగా మారిందని తెలుస్తుంది. డిజిటల్ ప్రాజెక్టులలో ఎక్కువ కంపెనీలు పెట్టుబడులు పెడుతుండడంతో వ్యాపార దృక్పథం మెరుగుపడుతోందని, ప్రారంభంలో మృదువైన డీల్ విజయాలు మే చివరి నుండి వేగాన్ని అందుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.