గత రెండేళ్లుగా 2 వేల రూపాయల నోట్ల ముద్రణ జరగలేదు

Tuesday, March 16th, 2021, 08:55:48 AM IST

భారత్ లో నొట్ల రద్దు ప్రక్రియ తర్వాత అంతా కూడా డిజిటల్ పే మెంట్స్ కి అలవాటు పడిపోయారు. అంతేకాక వెయ్యి రూపాయలని పూర్తి గా రద్దు చేసి, 2000 రూపాయల నోట్లను ముద్రించడం మొదలు పెట్టింది. అయితే గత రెండేళ్లుగా ఈ రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం లేదు అని తాజాగా లోక్ సభ లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత రెండేళ్లుగా రెండు వేల రూపాయల నోట్లు ముద్రణ జరగలేదు అని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఏప్రిల్ 2019 నుండి 2000 కరెన్సీ నోట్లను ముద్రించడం లేదు అని, ప్రజల ఆర్థిక లావదేవీలను దృష్టి లో ఉంచి, ఆర్బీఐ తో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది అని వ్యాఖ్యానించారు. అయితే మార్చి 30, 2018 నాటికి చెలామణి లో ఉన్న మొత్తం సంఖ్య 3.27 శాతం కాగా, 2021 నాటికి 2.01 శాతానికి తగ్గినట్లు వెల్లడించారు.రెండు వేల రూపాయల విలువ మొత్తం 336.2 కోట్లకరెన్సీ చెలామణి లో ఉన్నట్లు తెలిపారు.