రెస్టారెంట్ కి వెళ్ళిన రోహిత్ శర్మ తో సహ అందరికీ కరోనా నెగటివ్

Monday, January 4th, 2021, 11:39:25 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉండటం తో క్రికెట్ లో కూడా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆసీస్ టూర్ లో ఉన్న భారత్ ప్రస్తుతం టెస్ట్ సీరీస్ ఆడుతోంది. అయితే ఈ నెల ఏడవ తేదీ నుండి ఆస్ట్రేలియా తో మూడవ టెస్ట్ మ్యాచ్ జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నూతన సంవత్సర వేడుకల్లో భారత్ ఆటగాళ్ళు పలువురు రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేయడం సర్వత్రా హాట్ టాపిక్ అయింది. రోహిత్ శర్మ తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరంగా ఉన్నారు. అయితే మూడవ టెస్ట్ కోసం సన్నద్ధం అవుతున్న సందర్భం లో ఇలా రెస్టారెంట్ కి వెళ్ళడం సోషల్ మీడియా లో అందుకు సంబంధించిన బిల్ వైరల్ అవ్వడం బీసీసీఐ కి కూడా తలనొప్పి గా మారింది.

అయితే ఈ నేపథ్యం లో భారత ఆటగాళ్లు అందరికీ కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, అందరికీ కరోనా వైరస్ నెగటివ్ అని తేలింది. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. అయితే జట్టు సహాయ సిబ్బందికి కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ కరోనా వైరస్ నెగటివ్ అని తేలింది. అయితే ఏడవ తేదీ నుండి జరగనున్న టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు ప్రతి చోటా చర్చంశనీయం గా మారింది.