మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌కు ఇండియన్ బ్యాంక్ షాక్..!

Thursday, November 12th, 2020, 06:37:19 PM IST

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇండియన్‌ బ్యాంక్‌ షాక్‌ ఇచ్చింది. గతంలో ప్రత్యూష కంపెనీ 248 కోట్ల మేర ఇండియన్‌ బ్యాంక్‌‌లో రుణం తీసుకుంది. అయితే ఆ రుణానికి సంబంధించి 141.68 మేర బ్యాంకుకు బకాయి పడడంతో కంపెనీకి చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. నవంబరు 25వ తేదిన వేలం ప్రక్రియను నిర్వహిస్తామని ఈ మేరకు ఇ–ఆక్షన్‌ సేల్‌ నోటీసును జారీ చేసింది.

అయితే కూతురి పేరిట ఉన్న ఈ కంపెనీకి గంటా శ్రీనివాస్ గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించారు. అయితే బకాయిలను చెల్లించాలని అక్టోబరు 4, 2016 లో ప్రత్యూష కంపెనీకి ఇండియన్ బ్యాంకు నోటీసులు పంపిన రుణం చెల్లించలేక కంపెనీ చేతులెత్తేసింది. దీంత్ ఆ బకాయికి వడ్డీతో కలిపి ఆ రుణం విలువ 248 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో లోన్ కోసం పెట్టిన ప్రత్యూష గ్రూప్‌ ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది.