దేశవ్యాప్తంగా నేడు, రేపు బ్యాంకు సేవలు బంద్

Wednesday, December 18th, 2013, 04:15:24 PM IST

all-banks-list
దేశవ్యాప్తంగా బుధవారం, గురువారం బ్యాంకు సేవలు నిలిపివేసి బంద్ చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యు.ఎఫ్.బీ.యు) తెలిపింది. ఇందులో ఎస్.బి.ఐ సహా 27 ప్రభుత్వ బ్యాంకులు, 12ప్రైవేటు బ్యాంకులలోని మొత్తం దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఈ బంద్ లో పాల్గొననున్నట్లు వారు తెలిపారు వేతన సవరణ, ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో అవలంభిస్తున్న సంస్కరణల కు వ్యతిరేకంగా యు.ఎఫ్.బీ.యు కింద ఉన్న ఐదు ఉద్యోగ సంఘాలు, నాలుగు రాష్ట్ర స్డాయి ఉద్యోగ సంఘాలు ఈ బంద్ ని నిర్వహిస్తున్నాయి. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ లు కూడా యు.ఎఫ్.బీ.యు లో భాగమైనందున ఈ బంద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాల్గొంటుందని వారు తెలిపారు.